యూఎస్ ఓపెన్: సెమీస్‌కు సానియా.. వీనస్ ఓటమి
యూఎస్ ఓపెన్: సెమీస్‌కు సానియా.. వీనస్ ఓటమి
Published Fri, Sep 8 2017 10:04 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM
సాక్షి, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో సంచలనం నెలకొల్పింది. మహిళల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి, చైనాకు చెందిన షుయె పెంగ్‌తో కలిసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
గురువారం రాత్రి జరగిన క్వార్టర్ ఫైనల్‌లో 7-6(5), 6-4 తేడాతో ఆండ్రియా హ్లావ్కోవా, టిమియా బాబోస్ జోడీపై విజయం సాధించింది. వరుసగా ఐదు యూస్ ఓపెన్‌లలో సానియా సెమీస్‌కు ప్రవేశించటం ఇది నాలుగోసారి.
సెమీస్‌లో వీనస్ అవుట్...
ఇక మహిళల సింగిల్స్‌లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రపంచ టెన్నిస్ మాజీ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ టోర్నీ సెమీస్ లో ఓటమి పాలైంది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన స్లోనే స్టీఫెన్స్ చేతిలో 6-1, 0-6, 7-5 తేడాతో ఓడింది. 2002 నుంచి ఒక్క గ్రాండ స్లామ్ కూడా గెలుచుకోలేకపోయిన వీనస్ ను స్లోనే కోర్టులో ముప్పుతిప్పలు పెట్టింది. గత 11 నెలలుగా కాలి గాయంతో కోర్టుకు దూరమైన స్లోనే అద్భుతమైన ఫెర్‌ఫార్మెన్స్‌తో టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక శనివారం ఫైనల్ లో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్ తో స్లోనే స్టీఫెన్స్ తలపడనుంది.
Advertisement
Advertisement