‘బ్రా’ను కూడా వదల్లేదు! | Wimbledon 2017: Venus Williams pink bra code violation | Sakshi
Sakshi News home page

‘బ్రా’ను కూడా వదల్లేదు!

Published Wed, Jul 5 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

‘బ్రా’ను కూడా వదల్లేదు!

‘బ్రా’ను కూడా వదల్లేదు!

లండన్‌: సంప్రదాయం పేరుతో వింబుల్డన్‌ నిర్వాహకులు విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) కూడా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్‌ మెర్టెన్స్‌తో సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్‌ బయటకు కనిపించింది.

 ఈ విషయాన్ని టోర్నీ అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్‌లో విరామం సమయంలో వీనస్‌ లాకర్‌ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు ‘బ్రా’తో బరిలోకి దిగింది. ‘ఆట సమయంలో బయటకు కనిపించే లోదుస్తులు కూడా పూర్తిగా తెలుపు రంగుల్లోనే ఉండాలి. ఒకవేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా కనిపిస్తుంటే అది ఒక సెంటీమీటర్‌కు మించి ఉండరాదు’ అని వింబుల్డన్‌ నిబంధనలు చెబుతున్నాయి. లోదుస్తుల అంశంపై మీడియా సమావేశంలో చర్చించడం సభ్యత కాదని మ్యాచ్‌ అనంతరం వీనస్‌ దీనిపై వ్యాఖ్యానించింది.

గర్భవతిగా కోర్టులో...
లక్సెంబర్గ్‌ క్రీడాకారిణి, ప్రపంచ 82వ ర్యాంకర్‌ మ్యాండీ మినెలా ప్రస్తుతం నాలుగున్నర నెలల గర్భవతి. అయినా సరే ఆమె వింబుల్డన్‌లో పోటీకి వెనుకాడలేదు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రత్యేకంగా చేయించిన వదులు దుస్తులతో మినెలా బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆమె షివవోని (ఇటలీ) చేతిలో 1–6, 1–6 తేడాతో పరాజయం పాలైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement