Wimbledon champion
-
జొకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది. 2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
ప్రేక్షకుల్లేకుండా టోర్నీలు ఆడలేను
ప్రాగ్: ఖాళీ స్టేడియాల్లో ఆటకు తాను వ్యతిరేకమని చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా చెప్పింది. కరోనా మహమ్మారి విలయంతో ఇప్పుడంతా గేట్లు మూసే ఆటలపైనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మళ్లీ టెన్నిస్ పునరుద్ధరణ సందర్భంగా రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన క్విటోవా మాట్లాడుతూ ‘నాకు మరో గ్రాండ్‌స్లామ్ ఆడాలనే ఉంటుంది. కానీ ప్రేక్షకుల్లేకుండా ఆడే పరిస్థితి వస్తే... ఆటను రద్దు చేసుకోవడమే మేలని భావిస్తాను. అభిమానులే మా చోదకశక్తి. ఆ శక్తిలేని చోటును చూడాలనుకోను. అది అసలు గ్రాండ్‌స్లామ్ అనిపించుకోదు’ అని తెలిపింది. తాను మళ్లీ టెన్నిస్ క్రీడను ఒక్క చెక్ రిపబ్లిక్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. వైరస్ విస్తరిస్తుండటంతో ఈ సీజన్లో వింబుల్డన్‌ను రద్దు చేయగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. -
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ జొకోవిచ్‌దే
-
జైకోవిచ్...
కుడి మోచేతి గాయం కారణంగా గత ఏడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలిగిన నొవాక్ జొకోవిచ్... సంవత్సరం తిరిగేలోపే అదే వేదికపై చాంపియన్‌గా అవతరించాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి వెనుకబడిపోయిన ఈ సెర్బియా స్టార్ తాజా విజయంతో నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా మళ్లీ పైకెగిశాడు. లండన్: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ‘గ్రాండ్’ విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ జొకోవిచ్ 6–2, 6–2, 7–6 (7/3)తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్‌కాగా... కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక జొకోవిచ్ సాధించిన మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ అండర్సన్‌కు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో ఇవానిసెవిచ్ (క్రొయేషియా) తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తక్కువ ర్యాంక్ ఆటగాడు జొకోవిచ్ (21వ ర్యాంక్) కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై, సెమీఫైనల్లో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై ఐదు సెట్ల సుదీర్ఘ పోరాటాల్లో అద్భుత విజయాలు సాధించిన అండర్సన్ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 92 కేజీల బరువున్న అండర్సన్‌పై తొలి గేమ్ నుంచే ఆధిపత్యం చలాయించిన జొకోవిచ్ తొలి సెట్లో రెండు... రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లు సాధించి అలవోకగా సెట్లను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అండర్సన్ తేరుకోవడం... జొకోవిచ్ తన జోరును కొనసాగించడంతో ఒక్క బ్రేక్ పాయింట్ రాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజయానంతరం జొకోవిచ్ సరదాగా సెంటర్కోర్టులోని పచ్చికను నోట్లో వేసుకున్నాడు. నాకివి అద్భుతమైన క్షణాలు. నా భార్య, కుమారుడి ముందు గెలిచిన ఈ టైటిల్ నా జీవితంలోనే మధురానుభూతిగా మిగలనుంది. నా దృష్టిలో టెన్నిస్‌కు వింబుల్డన్ పవిత్రమైన వేదిక. టైటిల్‌తో పునరాగమనం చేసేందుకు ఇంతకుమించిన వేదిక ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడ ట్రోఫీని సగర్వంగా అందుకోవాలని నేను బాల్యంలోనే కలలు కనేవాణ్ని. ఇంత గొప్ప వేదికపై నాలుగోసారి టైటిల్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జొకోవిచ్ ఈ పచ్చిక ఎంతో తీయన... -
కేన్సర్‌తో పోరాడి...
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్‌లో పోరాట పటిమకు మారుపేరుగా నిలిచిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ యానా నొవోత్నా ఆదివారం కన్ను మూసింది. 49 ఏళ్ల నొవోత్నా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన నొవోత్నా... సింగిల్స్‌లో రెండో ర్యాంక్‌ను సాధించింది. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయిన నొవోత్నా... 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఎట్టకేలకు తన వింబుల్డన్ టైటిల్ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. 1987 నుంచి 1999 వరకు సాగిన తన కెరీర్ మొత్తంలో నొవాత్నా 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (సింగిల్స్‌లో ఒకటి, మహిళల డబుల్స్‌లో 12, మిక్స్డ్ డబుల్స్‌లో 4) ఉన్నాయి. 1988 సియోల్, 1996 అట్లాంటా ఒలింపిక్స్ డబుల్స్‌లో రజతాలు నెగ్గిన ఆమె అట్లాంటా ఒలింపిక్స్‌లోనే సింగిల్స్‌లో కాంస్యం సాధించింది. -
‘బ్రా’ను కూడా వదల్లేదు!
లండన్: సంప్రదాయం పేరుతో వింబుల్డన్ నిర్వాహకులు విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా మాజీ వరల్డ్ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్ మెర్టెన్స్తో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్ బయటకు కనిపించింది. ఈ విషయాన్ని టోర్నీ అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్లో విరామం సమయంలో వీనస్ లాకర్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు ‘బ్రా’తో బరిలోకి దిగింది. ‘ఆట సమయంలో బయటకు కనిపించే లోదుస్తులు కూడా పూర్తిగా తెలుపు రంగుల్లోనే ఉండాలి. ఒకవేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా కనిపిస్తుంటే అది ఒక సెంటీమీటర్‌కు మించి ఉండరాదు’ అని వింబుల్డన్ నిబంధనలు చెబుతున్నాయి. లోదుస్తుల అంశంపై మీడియా సమావేశంలో చర్చించడం సభ్యత కాదని మ్యాచ్ అనంతరం వీనస్ దీనిపై వ్యాఖ్యానించింది. గర్భవతిగా కోర్టులో... లక్సెంబర్గ్ క్రీడాకారిణి, ప్రపంచ 82వ ర్యాంకర్ మ్యాండీ మినెలా ప్రస్తుతం నాలుగున్నర నెలల గర్భవతి. అయినా సరే ఆమె వింబుల్డన్‌లో పోటీకి వెనుకాడలేదు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రత్యేకంగా చేయించిన వదులు దుస్తులతో మినెలా బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆమె షివవోని (ఇటలీ) చేతిలో 1–6, 1–6 తేడాతో పరాజయం పాలైంది. -
క్విటోవాపై కత్తితో దాడి
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా దొంగ చేతిలో గాయానికి గురైంది. ప్రొస్టెజోవ్ నగరంలో క్విటోవా నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో చోరీకి చేయడానికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఆమె ఎడమ చేతిపై దాడి చేశాడు. దొంగపై ఎదురుతిరిగిన క్రమంలో క్విటోవా గాయానికి గురైంది. ‘నేను ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యాను. గాయం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ సంఘటన తర్వాత నేను జీవించి ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటాను. కోలుకునే క్రమంలో కొంతకాలం నన్ను ఏకాంతంగా వదిలేయాలని కోరుతున్నాను’ అని 11వ ర్యాంకర్ క్విటోవా తెలిపింది. -
చనిపోతానేమోనని భయం వేస్తోంది!
మూడేళ్ల కిందట వింబుల్డన్ రాణిగా నిలిచిన ఫ్రాన్స్ ప్లేయర్ మరియన్ బర్తోలీ ప్రస్తుతం తీవ్ర ఆనారోగ్యంతో ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆమెకు వైరస్ సోకిందని, అయితే దాని వల్ల ఆమెకు మెరుగైన వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేయడంతో ఈ మాజీ ఛాంపియన్ పరిస్థితి గందరగోళంగా తయారయింది. ఓసారి ఈ ఫొటోలు చూడండి. 2013లో వింబుల్డన్ గెలిచిన బర్తోలీ అప్పుడు 60 కిలోలు ఉండేది.. కానీ వైరస్ బారినపడ్డాక కేవలం మూడు నెలల వ్యవధిలోనే 25 కిలో కిలోలు తగ్గిపోయింది. ఇక అన్నీ చీకటి రోజులే బరువు తగ్గడంపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. ఘన పదార్థాలకు తీసుకోకపోవడంతో ఆమె ఇలా అయ్యింనది, ఆమెకు ఆహార సమస్యలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారని చెప్పింది. అయితే భయంకరమైన వైరస్ తనను ఇలా చేసిందని అందరికీ ఎలా చెప్పగలనంటూ ప్రశ్నించింది. కొందరి వ్యాఖ్యలు వింటే నిజంగానే చచ్చిపోతానేమోనని భయం కూడా వేసిందని, తనకు ఇంకా బతకాలని ఉందని తన పరిస్థితిని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఇక అన్నీ చీకటి రోజులేనంటూ ఏడ్చేసింది. నిజానికి వింబుల్డన్ సన్నాహక మ్యాచ్ లలో పాల్గొంటానని చెప్పిన బర్తోలీ తీవ్ర అస్వస్థత కారణంగానే ఈవెంట్లో పాల్గొనలేదని వివరించింది. అసలు ఏం జరిగింది! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెంచ్ ఒపెన్ కోసం కొన్ని రోజుల ముందు సన్నాహక మ్యాచ్‌లలో పాల్గొని జూనియర్ ప్లేయర్లకు కొన్ని కిటుకులు నేర్పించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కాగానే విమానంలో సిడ్నీకి తిరుగు ప్రయాణమైంది. కామెంటేటర్ గా పని చేసింది. న్యూయార్క్ లో ఏదో పని నిమిత్తం మళ్లీ విమానమెక్కింది. కొన్ని రోజుల నుంచి ఓపిక తగ్గినట్లుగా ఉన్న బర్తోలీ క్రమక్రమంగా బరువు తగ్గిపోయింది. ఏం చేయాలో అర్ధంకాక డాక్టర్లను సంప్రదిస్తే టెస్టులు చేశారు కానీ వారి మెడిసిన్ ఆమెను రికవరీ చేయవని నమ్మకం లేదని చెప్పారని బర్తోలీ కన్నీటి పర్యంతమైంది. భారత్ లోనే ఏదో వైరస్ తనకు సోకి ఉంటుందని అభిప్రాయపడింది. 'అన్ని అవసరాలకు కేవలం మినరల్ వాటర్ మాత్రమే వాడుతున్నాను. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు దూరంగా ఉంటున్నాను. చర్మ వ్యాధులు వస్తాయేమోనన్న దిగులుతో నగలు, ఆభరణాలు లాంటివి ధరించడం లేదు' అని మాజీ ఛాంపియన్ చెప్పుకొచ్చింది. వింబుల్డన్ ఛాంపియన్‌గా బర్తోలీ ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నమెంట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల(2013లో) ఈ క్రీడాకారిణి వింబుల్డన్ టోర్నమెంట్లో విజేతగా అవతరించింది. సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బర్తోలీ 81 నిమిషాల్లో 6-1, 6-4తో 23వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై విజయం సాధించింది. కెరీర్లో 47వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన బర్తోలీకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2007లో వింబుల్డన్ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరిన బర్తోలీ టైటిల్ పోరులో వీనస్ విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సన్సినాటి టోర్నమెంట్లో ఓటమితో ఏకంగా టెన్నిస్ కు గుడ్ బై చెప్పి క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. టైటిల్ గెలిచే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది. -
సెరెనా అదరహో...
అనుభవానికి ఉరకలెత్తే ఉత్సాహం తోడైంది. అంచనాలు మళ్లీ నిజమయ్యాయి. మహిళల టెన్నిస్‌లో మకుటంలేని మహారాణి తానేనంటూ అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరోసారి నిరూపించింది. ఆరోసారి వింబుల్డన్ విజేతగా నిలిచి అదరహో అనిపించింది. లండన్: వయసు పెరుగుతున్నకొద్దీ మరింత మెరుగ్గా ఆడుతూ... మహిళల టెన్నిస్‌లో కొత్త శిఖరాలను అందుకుంటూ సెరెనా విలియమ్స్ ముందుకు సాగిపోతోంది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ గౌరవాన్ని పెంచుతూ... ఈ అమెరికా స్టార్ తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-4, 6-4తో 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలిచి ఆరోసారి వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. గతంలో సెరెనా 2002, 2003, 2009, 2010, 2012లలో ఈ టైటిల్‌ను సాధించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ముగురుజా పోరాటం అందర్నీ ఆకట్టుకున్నా... తుదకు సెరెనా అనుభవమే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్ ముగురుజాకు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సంచలన ఆరంభం చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తన సర్వీస్‌లను నిలబెట్టుకుంటేచాలు తొలి సెట్‌ను సొంతం చేసుకునే పరిస్థితిలో ముగురుజా తడబడింది. ఇక్కడే సెరెనా తన అపార అనుభవాన్ని ఉపయోగించింది. ఏడో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ అమెరికా స్టార్ స్కోరును 4-4తో సమం చేసింది. అదే జోరులో తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో మరోసారి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 6-4తో దక్కించుకుంది. రెండో సెట్లోనూ సెరెనా తన హవా చెలాయించింది. చూస్తుండగానే వరుస గేమ్‌లను సాధించి 5-1తో ఆధిక్యంలోకి వచ్చేసింది. ఇక సెరెనా విజయం లాంఛనమే అనుకుంటున్న దశలో ముగురుజా అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆధిక్యాన్ని 4-5కి తగ్గించింది. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొనిఉంటే ముగురుజా స్కోరును 5-5తో సమం చేసేది. అయితే సెరెనా దూకుడుగా ఆడి ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో గనుక సెరెనా విజేతగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేస్తుంది. గతంలో మౌరిన్ కానెల్లీ (అమెరికా-1953లో), మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-1970లో), స్టెఫీగ్రాఫ్ (జర్మనీ- 1988లో) మాత్రమే ఒకే ఏడాదిలో 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు. స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-1988లో) తర్వాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ సెరెనాయే. ఓవరాల్‌గా అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టై టిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరెనా మూడో స్థానంలో (21) ఉంది. మార్గరెట్ కోర్ట్ (24), స్టెఫీగ్రాఫ్ (22) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) పెద్ద వయస్సులో (33 ఏళ్ల 289 రోజులు) గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. మార్టినా నవ్రతిలోవా (33 ఏళ్ల 263 రోజులు-1990లో వింబుల్డన్) పేరిట ఉన్న రికార్డును సెరెనా బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా సెరెనా ఖాతాలో ఇది 34వ (సింగిల్స్‌లో 21, డబుల్స్‌లో 13) గ్రాండ్‌స్లామ్ టైటిల్. -
‘రైట్ టు ప్లే’ అంబాసిడర్‌గా క్విటోవా
హాంకాంగ్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ‘రైట్ టు ప్లే’ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలకు ఈ సంస్థ విద్యను అందిస్తోంది. షెన్జెన్ ఓపెన్ సన్నాహకాల్లో భాగంగా క్విటోవా ప్రస్తుతం హాంకాంగ్‌లో ఉంది. ‘గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టా. నా హృదయానికి దగ్గరగా ఉన్న క్రీడతో కలిసి చిన్నారులకు శిక్షణ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప అనుభూతి’ అని క్విటోవా వ్యాఖ్యానించింది. స్పీడ్ స్కేటింగ్‌లో నాలుగుసార్లు ఒలింపిక్ స్వర్ణం గెలిచిన జాన్ కోస్ 2000లో ఈ సంస్థను ప్రారంభించారు. 40 దేశాలు, ప్రాం తాల నుంచి 300 మంది వాలంటీర్ అథ్లెట్లు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ‘క్విటోవా అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె మా జట్టుతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ ఆటతో క్విటోవా టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలబడింది’ అని ఈ సందర్భంగా కోస్ ప్రశంసించారు.