తైవాన్ ఓపెన్ సెమీస్లో వీనస్ | Venus Williams beats Anastasija Sevastova to reach semi-finals of Taiwan Open | Sakshi
Sakshi News home page

తైవాన్ ఓపెన్ సెమీస్లో వీనస్

Published Fri, Feb 12 2016 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

Venus Williams beats Anastasija Sevastova to reach semi-finals of Taiwan Open

కావ్సియాంగ్:టాప్ సీడ్ వీనస్ విలియమ్స్ తైవాన్ ఓపెన్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో వీనస్ 7-5, 6-2 తేడాతో అనాస్తాసిజా సెవాస్తోవాను ఓడించి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో 10 బ్రేక్ పాయింట్లకు గాను ఏడు పాయింట్లను వీనస్ గెలిచి సెవాస్తోవాపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

 

ఇదిలా ఉండగా మరో మ్యాచ్ లో మూడో సీడ్ పుతిన్త్ సేవా సెమీస్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో పుతిన్త్ సేవా తొలి సెట్ ను 6-3 తేడాతో చేజిక్కించుకున్న అనంతరం స్టెఫనీ వోయిజిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పుతిన్త్ సేవా సెమీస్ కు చేరి వీనస్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement