అందాల భామ, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెకు కాలుకు బలమైన గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఎడమకాలి పాదం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఆమె వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా షూటింగ్ సమయంలో నటి పూజా హెగ్డేకు గాయమైంది. ఆమె చివరిసారిగా విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రంలో కనిపించింది.
(చదవండి: పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!)
ఆ ఫోటోలో పూజా హెగ్డే.. నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వాకర్ పట్టుకుని స్టెప్స్ వేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాలో హ్యాండిల్‌లో రాస్తూ..' నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది బుట్టబొమ్మ. పూజా హెగ్డే తదుపరి చిత్రం మహేష్ బాబుతో జతకట్టనుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఆమె రణ్‌వీర్ సింగ్ నేతృత్వంలోని హిందీ మూవీ 'సర్కస్'లోనూ కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment