కోలుకుంటున్న కమల్ | Kamal Haasan is still recuperating from his leg injury | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న కమల్

Published Tue, Aug 2 2016 4:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

కోలుకుంటున్న కమల్

కోలుకుంటున్న కమల్

గత నెల 14న తన ఆఫీస్లో గాయపడిన కమల్, ఇన్నాళ్లుకు లేచి నడవగలిగాడట. శభాష్ నాయుడు సినిమా ఫారిన్ షూటింగ్ ముగించుకొని వచ్చిన కమల్, గత నెల మెట్లు దిగుతూ జారిపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు ఫ్యాక్చర్ అయ్యింది.  అప్పటి నుంచి మంచానికే పరిమితమైన కమల్, దాదాపు రెండు వారాల తరువాత లేచి నడిచారు.

ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్న కమల్ హాసన్, ' నా రూంలో చుట్టూ తిరగగలిగాను. అయితే గాంధీజీలా ఇద్దరి సాయం తీసుకునే నడిచాను. ఈ రోజు నొప్పి కాస్త తక్కువగానే ఉంది' అంటూ తన ట్విట్టర్ పేజ్లో కామెంట్ చేశారు. కమల్ గాయం కారణంగా శభాష్ నాయుడు షూటింగ్ వాయిదా పడింది. కమల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండటంతో ఆయన కొలుకునే వరకు సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement