‘సర్కస్ కార్-2’లో హీరోయిన్‌గా తేజస్వి మదివాడ | Tejaswi Madivada Play Key Role In Circus Car 2 Movie | Sakshi
Sakshi News home page

Tejaswi Madivada: ‘సర్కస్ కార్-2’లో హీరోయిన్‌గా తేజస్వి మదివాడ

Published Fri, Dec 10 2021 2:37 PM | Last Updated on Fri, Dec 10 2021 2:37 PM

Tejaswi Madivada Play Key Role In Circus Car 2 Movie - Sakshi

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కస్‌ కార్‌-2’.నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ ఇది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘తేజస్వి మదివాడ’ఎంపికయ్యారు.  ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ... ‘నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన "సర్కస్ కార్" చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ‘సర్కస్ కార్-2’లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్’ అన్నారు.    

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె ృమాట్లాడుతూ... ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ‘సర్కస్ కార్-2’ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది.  పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ ‘సర్కస్ కార్-2’కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి’ అన్నారు.  బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement