బిగ్‌బాస్‌: తేజస్వీ ఔట్‌ | Tejaswi Madivada Eliminated BiGG Boss | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 22 2018 9:23 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Tejaswi Madivada Eliminated BiGG Boss - Sakshi

తేజస్వీ

సాక్షి, హైదరాబాద్‌ : అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్‌ అయింది. అదేంటీ ఎపిసోడ్‌ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్‌ ఒక రోజు ముందు షూటింగ్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి తేజస్వీయే ఎలిమినేట్‌ అవుతుందని అందరూ ఊహించినదే.. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ప్రవర్తించిన తీరు.. ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఈ దెబ్బతోనే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అయిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇక హౌస్‌ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్‌ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తనువంతు వచ్చిందని, హౌస్‌ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్‌లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్‌ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బయటకు వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. 

తేజస్వీ ప్రేమలో పడ్డా..
ఇక అర్థరాత్రి లైట్స్‌ ఆఫ్‌ అయినా పడుకోకుండా ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్న రోల్‌రైడా దీప్తి, తనీష్‌లు, సామ్రాట్‌, తేజస్వీలు హౌస్‌లోకి ఎందుకు వచ్చామో ఒక్కొకరు తెలిపారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. 100 రోజుల్లో 50 లక్షలు గెలుచుకోవచ్చని, సినిమాలు చేసిన ఇంత సంపాదించలేనని అందుకే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు పేర్కొంది. నిజానికి తాను ఎవరిని ప్రభావితం చేయలేదని, సామ్రాట్‌ను అనుసరించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఈ చర్చ సందర్భంగా సామ్రాట్‌ మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు బిగ్‌బాస్‌ హౌస్‌కు రావాలని లేదు. నా జీవితంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక నాకు తేజస్వీ నుంచి స్వచ్చమైన ప్రేమ దొరికింది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వీరి బంధం బయట కూడా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

ఆకట్టుకున్న నాని..
శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని తనదైన శైలితో అలరించాడు. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అందరి నటనను సమీక్షించాడు. ఇక ఈ వారంలో హైలైట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడాడు. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌, గణేష్‌ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్‌ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్‌ గురించి చేసిన హంగామా.. నందిని, కౌశల్‌ మధ్య జరిగిన సంభాషణలపై చర్చించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తనీష్‌కు అభినందనలు తెలిపాడు. ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్న రోల్‌రైడా, దీప్తీ, తనీష్‌లను ప్రోటెక్ట్‌ అయ్యారని చెప్పి.. బిగ్‌బాస్‌ ప్రేమజంటలో ఒకరు నిష్క్రమించక తప్పదు అని పేర్కొన్నాడు. అయితే ఈ సస్పెన్స్‌తో రేటింగ్స్‌ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్‌ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలింది. తొలి వారం సంజన ఎలిమినేషన్‌ తప్ప అన్నీ వారాలు ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం ముందే తెలిసిపోయింది. 

బయటకు వచ్చిన అనంతరం తేజస్వీతో ఓ అభిమాని సెల్ఫీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement