బిగ్‌బాస్‌ ఓటీటీ ఫస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే? | Bigg Boss Non Stop: Tejaswi Madivada Becomes First Captain | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో మొట్ట మొదటి కెప్టెన్‌ ఎవరో తెలుసా?

Published Fri, Mar 4 2022 8:56 AM | Last Updated on Fri, Mar 4 2022 8:56 AM

Bigg Boss Non Stop: Tejaswi Madivada Becomes First Captain - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎదురైన అవాంతరాలకు చెక్‌ పడింది. నాన్‌స్టాప్‌ అన్న పేరుకు తగ్గట్టుగానే రోజుకి 24 గంటలు హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌస్‌లో తొలివారం నామినేషన్స్‌ కూడా పూర్తయ్యాయి. సరయు, నటరాజ్‌ మాస్టర్‌, ముమైత్‌ ఖాన్‌, అరియానా గ్లోరీ, మిత్ర శర్మ, హమీదా, ఆర్జే చైతూ ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ ముగిసింది. ఈ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. ఆమె నటరాజ్‌ మాస్టర్‌ను రేషన్‌ మేనేజర్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.  ఎలాగైనా కెప్టెన్‌ అవ్వాలనుకున్న అషూ రెడ్డి కనీసం కంటెండర్‌గా కూడా పోటీ చేయలేపోవడంతో బాధతో ఏడ్చేసింది. మరి తేజస్వి కెప్టెన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ను, హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement