
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ఆదరించేవాళ్లు చాలామందే ఉన్నారు. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. టాస్కులు, నామినేషన్ల పర్వం, అప్పుడప్పుడూ గెస్టుల రాకతో బాగానే నెట్టుకొస్తున్నారు కానీ ఎలిమినేషన్లే ఎవరికీ అంతు చిక్కడం లేదు.
టాప్ 5లో లేదా టాప్ 10లో ఉంటారనుకునే కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా ఆమె గత వారమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రెండో వారం శ్రీరాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఐదో వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అవడం చాలామందికి ఇప్పటికీ మింగుడుపడటం లేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను ఇలా సడన్‌గా ఎలా పంపించేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే హౌస్ నుంచి వచ్చేసిన తేజస్వి బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ రవి దగ్గర హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అఖిల్ హీరో, స్రవంతి మిర్చి, మిత్ర కాకరకాయ, నటరాజ్ మాస్టర్ రాడ్, అనిల్ కేటుగాడు అని తెలిపింది. అవకాశం ఇస్తే ఎవరిని తుపాకీతో లేపేస్తావంటే క్షణం ఆలోచించుకోకుండా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. నటరాజ్ మాస్టర్ లాంటి తండ్రి తనకు వద్దంది తేజస్వి. పక్కనవాళ్లను తొక్కుకుంటూ పోయేవాళ్లు నచ్చరంటూ బిందుమాధవి ఫొటోను చించేసింది.
గతంలో బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక తనకు పనివ్వడమే మానేశారని, ట్రోలింగ్ వల్ల ఏడుస్తూనే ఉన్నానంది. దీన్నుంచి బయటపడేందుకు ట్రావెలింగ్ చేసి మళ్లీ నార్మల్ అయ్యానంది. ఈసారి బిగ్‌బాస్‌లో నటరాజ్ మాస్టర్ అనే వ్యక్తి ఒక్కడే నామినేట్ చేసి పంపించేశాడని. తండ్రి అనుకున్న వ్యక్తి కాటేశాడు అంటూ బాధపడింది.
Comments
Please login to add a commentAdd a comment