
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్ తర్వాత ఓటీటీకి కూడా వెళ్లాడు. అక్కడ కూడా తన ఆటతో, మాట తీరుతో అభిమానులను అలరించిన అతడు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)లోనూ రన్నరప్‌గా అవతరించాడు. రెండుసార్లు తనను ఆదరించి, ఓటేసిన ప్రేక్షకులకు ఎన్నివేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఉప్పొంగియేవాడు అఖిల్. ప్రస్తుతం అతడు బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొంటున్నాడు.
డ్యాన్స్‌తో స్టేజీ గడగడలాడిస్తున్న అఖిల్ తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తేజుతో డేటింగ్ చేస్తున్నావా? అని ముక్కుసూటిగా అడిగేశాడు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. జనాలు చాలా త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. మేము మంచి స్నేహితులమని ఎందుకు అనుకోరు? మేము కలిసి షో చేస్తున్నంత మాత్రాన ఇద్దరం ప్రేమించుకున్నట్లు కాదు అని నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు.
చదవండి: ఏయ్.. డోంట్ టచ్‌మీ.. నాకు పెళ్లైపోయింది: నటి
సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మరణం
Comments
Please login to add a commentAdd a comment