బిగ్‌బాస్‌ మరో అవకాశం.. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌! | Bigg Boss Gives One More Chance For Spectators | Sakshi
Sakshi News home page

Jul 23 2018 12:20 PM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss Gives One More Chance For Spectators - Sakshi

తేజస్వీ రీఎంట్రీ కోసమే.. అని అభిమానుల ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఏదైనా జరగొచ్చు’ అన్నట్లే ఊహించిన విధంగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్‌ నాని. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి ఎవరైన కొత్తవారు వస్తారని అందరూ భావించారు.. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని పటా పంచల్‌ చేస్తూ బిగ్‌బాస్‌ ఓ ప్రోమో రిలీజ్‌ చేశాడు.

‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్‌ మేట్స్‌ను సేవ్‌ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఓటింగ్‌ లైన్స్‌ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతాయని బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలిమినేట్‌ అయిన హౌస్‌ మేట్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా తమకు అనుకూలంగా ప్రేక్షకులు ఓటేసేలా ప్రచారం మొదలుపెట్టారు. ఇక తొలి వారం సంజనా, రెండో వారం నూతన నాయుడు, మూడో వారం కిరీటీ, నాలుగో వారం శ్యామల, ఐదో వారం భానుశ్రీ, ఆరోవారం తేజస్వీలు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.

తేజస్వీ రీఎంట్రీ కోసమే..
ఈ బిగ్‌బాస్‌ అవకాశాన్ని కొందరు స్వాగతిస్తుండగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తేజస్వీ రీఎంట్రీ కోసమే ఈ అవకాశం కల్పించారని పలువురు ఆరోపిస్తుండగా.. ఆమె అభిమానులు మాత్రం తెగ సంతోషడుతున్నారు. ‘స్టార్‌ మా’  ఫెస్‌బుక్‌ పేజీ కామెంట్‌ సెక్షన్‌లో అభిమానుల కౌశల్‌ Vs తేజస్వీలుగా విడిపోయారు. తేజస్వీకి ఓటేయండి.. ఇదో సువర్ణవకాశమని ఆమె అభిమానులు కోరుతున్నారు. కౌశల్‌ అభిమానులు మాత్రం.. నూతన్‌ నాయుడు, శ్యామలకు ఓటేయ్యాలని పిలుపునిస్తున్నారు. ఈ విషయంలో వారు కొంత బిగ్‌బాస్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: తేజస్వీ ఔట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement