మరో చరిత్ర సినిమాతో వెండితెరకు పరిచయమైంది కాకినాడ శ్యామల. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఇటీవలే తన ఆస్తులు ఎలా కరిగిపోయాయో వెల్లడించిన ఆమె తనపై, తన భర్తపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది.
'నా భర్తను హత్య చేశారు. కానీ ఆ హత్య నేను చేయించినట్లు నాపై నింద వేశారు. దాన్ని నేను తప్పని నిరూపించి హత్య చేసిన వ్యక్తికి 18 ఏళ్లు జైలుశిక్ష పడేలా చేశాను. ఒకరోజు నేను బయటకు వెళ్లి వస్తుంటే ఒకతను నా నెత్తిపై కొట్టాడు. బాధతో నేను తల్లడిల్లుతుంటే నన్ను ఇంకా కొడుతూనే ఉన్నాడు. అలా నన్ను కూడా చంపాలని చూశారు. ఇదంతా చేయించింది మరెవరో కాదు, నాకు వరుసకు కొడుకైన వ్యక్తి! స్వయానా నా భర్త అన్న కొడుకే ఆస్తి కోసం ఇంత కుట్ర పన్నాడు. చివరకు నన్ను అనాధను చేశారు. నాకు పిల్లలు పుట్టకపోవడంతో చెల్లి కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను' అంటూ కంటతడి పెట్టుకుంది కాకినాడ శ్యామల.
Comments
Please login to add a commentAdd a comment