కాకినాడ శ్యామల.. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని దాదాపు 200 భాషల్లో నటించింది. రంగస్థలంలో తన సత్తా చాటిన ఆమె మరో చరిత్ర సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మరో చరిత్ర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, ఆనంద భైరవి, మయూరి, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులో చాలా సినిమాలే చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు ఎలా కరిగిపోయాయనే విషయాన్ని బయటపెట్టింది.
'మరో చరిత్ర మూవీతో నా సినీ కెరీర్ మొదలైంది. నటించడమే కాకుండా నిర్మాతగానూ కొన్ని చిత్రాలు తెరకెక్కించాను. కృష్ణంరాజుతో నిత్య సుమంగళి సినిమా తీశాను. అది బానే ఆడింది, కానీ డిస్ట్రిబ్యూటర్ మోసం చేయడంతో డబ్బులు పోయాయి. పచ్చబొట్టు సినిమా తీశాం. అప్పుడు మళ్లీ డిస్ట్రిబ్యూటర్‌తో విబేధాలు రావడంతో సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. మధ్యలో మా ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. ఆయనకు మా మామయ్యగారు 600 ఎకరాలు రాసిచ్చారు. మా ఆయన రసికుడు, పని పాటా లేదు. ఆరు వందల ఎకరాలను 38 ఎకరాలు చేశాడు. నేను ఆయన్ను చాలా తిట్టేవాడిని.. మగాడివైతే సంపాదించి భార్యాబిడ్డలకు పెట్టాలి. అలాంటి మగాడిని ఇష్టపడతాను. నా దృష్టిలో నువ్వు మగాడివే కాదని ముఖం మీదే తిట్టాను. ఆయన 63 ఏళ్ల వయసులో చనిపోయాడు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: నాన్న చనిపోయారనగానే హ్యాపీగా ఫీలయ్యా: జబర్దస్త్ పవిత్ర
Comments
Please login to add a commentAdd a comment