
తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోనని వెల్లడించారు.
అయితే ఎవరినీ కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఎవరి అభిమానం వారిదని.. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తనవంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు వైఎస్సార్సీపీ అప్పగించిన పనిని నిర్వర్తించానని శ్యామల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment