Bigg Boss Syamala New House Warming Video Goes Viral: యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో శ్యామల ఒకరు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌తో మెప్పిస్తుంది. ఆడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోననూ యాక్టివ్‌గా ఉండే శ్యామల తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
ఇటీవలె కొత్త ఇంట్లోకి మారిన ఈ యాంకరమ్మ తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను షేర్‌చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. కమెడియన్ అలీ, యాంకర్ సుమ దంపతులు, తనీష్, గీతా మాధురి సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment