
Anchor Shyamala New House Warming Promo Video Viral: టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇటీవలె యాంకర్ శ్యామల కొత్త ఇంట్లోకి మారింది.
దీనికి సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్ కనకాల, తనీష్‌లతో పాటు సింగర్ గీతా మాధురి సహా పలువురు పాల్గొన్నారు. కాగా శ్యామల బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొన్న సంగతి తెలిసిందే.