Anchor Syamala Shares Her New Home Tour Video, Video Viral On Social Media - Sakshi

Anchor Syamala: హోంటూర్‌ వీడియోను షేర్‌ చేసిన యాంకర్‌ శ్యామల

Jul 26 2022 4:10 PM | Updated on Jul 26 2022 4:53 PM

Anchor Syamala Shares Her New Home Tour Video - Sakshi

తన దగ్గర ఒక్క మేకప్‌ కిట్‌ కూడా ఉండదని, యూట్యూబ్‌లో వీడియోలు చేసేటప్పుడు కూడా మేకప్‌ వేసుకోనని చెప్పుకొచ్చింది శ్యామల. తన మేకప్‌ సామాగ్రి మేకప్‌మెన్‌ దగ్గరే ఉంటాయంది. తన ఇంటికి లిఫ్ట్‌ కూడా ఉందని చూపించింది.

టాలీవుడ్‌లోని ప్రముఖ యాంకర్లలో శ్యామల ఒకరు. టీవీ షోలతో పాటు ఆడియో ఫంక్షన్స్‌, ఇంటర్వ్యూలు చేస్తూ యమ బిజీగా ఉండే శ్యామల తాజాగా యూట్యూబ్‌లో హోమ్‌టూర్‌ వీడియో చేసింది. ఇంకేముందీ, క్షణాల్లో అది వైరల్‌గా మారింది.

ఇల్లు.. ప్రతి ఒక్కరి కల.. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. నా కల ఈ ఇంటి ద్వారా నిజమైందంటూ తన ఇంటిని అంతా చూపించింది. పల్లె వాతావారణం నుంచి వచ్చిన తాను కబుర్లు పెట్టుకునేందుకు వీలుగా ఇంటి ముందు అరుగులా ఉండేలా మెట్లు నిర్మించుకున్నామని చెప్పుకొచ్చింది. ఇది తనకెంతో ఇష్టమైన ప్రదేశమని, ఎక్కువగా ఇక్కడే చిల్‌ అవుతామని తెలిపింది.

దేవున్ని ఎక్కువగా నమ్ముతానంటూ మొదటగా పూజగది చూపించింది. తర్వాత వంట చేయడం ఇష్టమంటూ తన విశాలమైన కిచెన్‌ గదిని చూపించింది. కిచెన్‌ పెద్దగా ఉండటంతో అక్కడే డైనింగ్‌ టేబుల్‌ ఏర్పాటు చేసుకున్నారు. శ్యామల ఇంట్లో రెండు హాల్స్‌, నాలుగు బెడ్‌రూమ్స్‌ ఉన్నాయి. అందులోనే కుమారుడు ఇషాన్‌ కోసం ప్రత్యేక బెడ్‌రూమ్‌ ఉంది. స్పైడర్‌ మ్యాన్‌ థీమ్‌తో ఉన్న ఈ రూమ్‌కు అటాచ్‌డ్‌ బాల్కనీ కూడా ఉంది. 

తన దగ్గర ఒక్క మేకప్‌ కిట్‌ కూడా ఉండదని, యూట్యూబ్‌లో వీడియోలు చేసేటప్పుడు కూడా మేకప్‌ వేసుకోనని చెప్పుకొచ్చింది శ్యామల. తన మేకప్‌ సామాగ్రి మేకప్‌మెన్‌ దగ్గరే ఉంటాయంది. తన ఇంటికి లిఫ్ట్‌ కూడా ఉందని చూపించింది. అలాగే ఓపెన్‌ వార్డ్‌ రోబ్‌, రీడింగ్‌ ప్లేస్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను చూపించింది. పైన సోలార్‌ ప్యానెల్‌ను పెట్టామంది.

చదవండి: నటికి అరుదైన వ్యాధి, వారం రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు
మాచర్ల కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం.. మాచర్ల ధమ్కీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement