
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా.. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. కాగా డార్లింగ్ విషయంలో అందరి మదిలో మెదిలే ప్రశ్నఆయన పెళ్లి. ప్రభాస్ పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్నీ కావు. బాహుబలి తర్వాత, సాహో తర్వాత పెళ్లి అంటూ అనేక కథనాలు రాగా అవన్నీ అబద్ధాలుగానే మిగిలిపోయాయి. ఇక తాము అభిమానించే హీరో పెళ్లి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఈ విషయం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ రాలేదు.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘జాన్’ మూవీ అనంతరం డార్లింగ్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లిపై పెదనాన కృష్ణం రాజు భార్య శ్యామలా దేవీ స్పందించారు. శ్యామల దేవి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. తన వివాహ విషయంలో వస్తున్నవన్నీ పుకార్లు. అవిచూసి మేము చాలా నవ్వుకున్నాం. మాది పెద్ద కుటుంబం. అందరితో కలిసిపోయి ఉండే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాం. దొరకగానే ప్రభాస్ పెళ్లి’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. వెకేషన్‌లో ఉన్న ప్రభాస్ తిరిగి రాగానే జనవరిలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనున్నారు. లవ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజ హెగ్డే కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment