
యాంకర్ శ్యామల
బిగ్‌బాస్ షోలో నాల్గోవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన శ్యామల ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో బాబు గోగినేని కొన్ని విషయాల్లో బోరింగ్‌గా అనిపిస్తారని, తనీష్ కోపం, తేజస్వీ మాట్లాడే విధానం తనకు నచ్చలేదని చెప్పారు. బిగ్‌బాస్ ఇంట్లో ఇంకా మనకు తెలియని విషయాలను, చూడని సంగతులెన్నింటినో సాక్షితో పంచుకున్నారు. బిగ్‌బాస్ విజేతగా గెలవాలని ట్రిక్స్ ప్లే చేయలేదని తనలానే ఉంటూ.. ఎంతవరకు ఉంటే అంతవరకే ఉందామనుకున్నా.. కానీ ఇంకొన్ని వారాలు ఉంటే బాగుండేదని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చారు.
బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ వల్లే..
దీప్తి సునయనాతో ఎలిమినేషన్ సమయంలో మాట్లాడి వచ్చానని, కానీ ఆ విషయాన్ని ప్రసారం చేయలేదన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్.. తనీష్ చేసిన యాక్టింగ్ కారణంగా.. శ్యామల వల్లే ఇదంతా జరిగిందని, ఆ కోపంతోనే ఎలిమినేషన్‌లో తనను నామినేట్ చేశానని దీప్తి సునయనా చెప్పిందని శ్యామల తెలిపారు. దీప్తి సునయనా కూడా నానితో ‘తను నామినేషన్ చేసిన శ్యామల వెళ్లిపోకూడదని, తప్పుగా అనుకొని నామినేట్ చేశాన’ని చెప్పిందంటూ శ్యామల వివరించారు. ఇంట్లోంచి వెళ్లేప్పుడు అందరితో మాట్లాడానని, కానీ దీప్తి సునయనాతో మాట్లాడిన విషయాన్ని ప్లే చేయలేదని వెల్లడించారు.
మైక్‌లు తీసేసి మరీ...
దీప్తి, గీతా మాధురి, శ్యామల మైక్‌లు తీసేసి బిగ్‌బాస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంపై నాని కూడా వారిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కౌశల్ దీప్తికి చెప్పిన విషయంపై మాతో మాట్లాడాలని దీప్తి చెప్పేసరికి.. అదేంటో తెలుసుకుందామనే ఆతృతలో బిగ్‌బాస్ రూల్స్ మరిచిపోయామని శ్యామల చెప్పారు. బిగ్‌బాస్ ఇంట్లో సీక్రెట్ ప్లేస్ అదొక్కటేనని, ఏడుపు వచ్చినా అక్కడికి వెళ్లాల్సిందేనని వివరించారు.
ఎల్లో టీమ్ కానందునే...
చెరుకు రసం ఈవెంట్‌లో నేను ఎల్లో టీమ్ సభ్యురాలిని కానందువల్లే కౌశల్, తేజస్వీ నాకు ఓటు వేయలేదు. ఆ టాస్క్‌లో ఎల్లో టీమ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన ఓటు హక్కును వారి ఎల్లో టీమ్ సభ్యులకే ఉపయోగిస్తామని వారు మాటిచ్చారు. అందువల్లే ఎల్లో టీమ్ సభ్యులైన నందిని, దీప్తిలను ఎలిమినేషన్ నుంచి తప్పించారని శ్యామల తెలిపారు.
తనను అసలు చూపించలేదు: శ్యామల భర్త నరసింహా
సీరియల్ నటుడు, శ్యామల భర్త నరసింహా మాట్లాడుతూ.. శ్యామలను ఎక్కువ సేపు చూపించలేదని, అందువల్ల తను సేఫ్‌గేమ్ ఆడినట్టు అందరూ అనుకుంటున్నారు. తను హౌజ్‌లో ఉన్నది 28 రోజులైతే.. తనను చూపించింది తక్కువ సమయమేనని పేర్కొన్నారు.
శ్యామల ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు భారీగా మద్దతు లభిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శ్యామల మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి రావాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో.. ఎందుకంటే నాని ముందే చెప్పారు కదా.. ఏమైనా జరగొచ్చు అని.
Comments
Please login to add a commentAdd a comment