పవన్‌ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా | Ex Minister Roja Satirical Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా

Published Tue, Oct 8 2024 3:12 PM | Last Updated on Tue, Oct 8 2024 3:20 PM

Ex Minister Roja Satirical Comments On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పవన్‌.. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు.. వైజాగ్‌ స్టీల్‌ కార్మికుల కోసమని చురకలంటించారు. మీరు కడగాల్సింది.. మెట్లను కాదు. ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి రోజా ట్విట్టర్‌ వేదికగా.. 
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ..

మీరు పంచె ఎగ్గాట్టాల్సింది… గుడి మెట్ల పై కాదు..
విజయవాడ వరద బాధితుల కోసం!

మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది.. నడి రోడ్డు పై కాదు.
వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం!

మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు.
నీట మునిగి.. సాయమందని పేదల కోసం!

మీరు కడగాల్సింది.. మెట్లను కాదు…
ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని..!

మీరు దీక్ష చేయాల్సింది.. ప్రసాదాల కోసం కాదు.
రాష్ట్రం లో రాలి పోతున్న.. ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం!

మీరు ఉపవాసం ఉండాల్సింది.. దేవుళ్ల కోసమే కాదు.
ఎక్కడ చూసినా.. ఆహారం కలుషితమై.. ఆసుపత్రి పాలవుతున్న.. విద్యార్థుల కోసం!

మీరు బొట్లు పెట్టాల్సింది.. గుడి మెట్లకు కాదు.
నాడు నేడు ని… కొనసాగించి… బాగుపరిచిన .. బడి మెట్లకు!

మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది.. ఇప్పుడు ఏ లోటు లేని.. సనాతనం కోసం కాదు.
మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం!

మీరు ఆపసోపాలు పడాల్సింది.. కొండెక్కడం కోసం కాదు.
రాష్ట్రంలో క్షీణిస్తున్న.. శాంతి భద్రతలు అరికట్టడం కోసం!

మీరు సంప్రోక్షణ చేయాల్సింది.. కల్తీ జరిగిందో లేదో తెలియని.. లడ్డూ కోసం కాదు
ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన కూటమి నాయకుల అవినీతి ప్రక్షాళన కోసం!

మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు..
మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన..!

దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి 
పవన్‌ కళ్యాణ్‌ స్వామీ...🙏🙏🙏’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

ఇది కూడా చదవండి: పవన్‌ను సీఎం చేయడమే బీజేపీ ప్లాన్‌: సీపీఎం కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement