
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోయారు. సంబరాల పేరుతో దిల్ షుక్ నగర్ మెయిన్ రోడ్డు పై ఉన్న మైత్రి లేడీస్ హాస్టల్‌పై రాళ్లు రువ్వారు. అమ్మాయిలు బయటకు రావాలంటూ దాదాపు అరగంటపాటూ వీరంగం సృష్టించారు. 30 మంది వరకు ఆకతాయిలు అక్కడికి చేరుకొని విద్యార్థినులు బయటకు రావాలి అంటూ దుర్భాషలాడారు. హాస్టల్ గేటును తన్నుతూ నానా యాగీ చేశారు.
రాళ్లు రువ్వడంతో హాస్టల్ గదుల ఆద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో హాస్టల్లోని యువతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టింది. ఈలోగా ఆకతాయిలను అక్కడి స్థానికుల చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆకతాయిల వీరంగాన్ని స్థానికులు వీడియో తీశారు. వీటి సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
లేడీస్ హాస్టల్ ఎదుట రెచ్చిపోయిన ఆకతాయిలు
Comments
Please login to add a commentAdd a comment