హాస్టల్‌లోనే ఎన్నోసార్లు నాపై దారుణం! | IIT Student files Rape complaint against IAF Officer | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లోనే ఎన్నోసార్లు నాపై దారుణం!

Published Thu, Jan 25 2018 7:36 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

IIT Student files Rape complaint against IAF Officer - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కాన్పూర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కల్యాన్‌పూర్ సీఐ నవీన్ కుమార్ సింగ్ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థినికి ఐఏఎఫ్ అధికారి సితాన్షుతో సోషల్ మీడియాలో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు తరచుగా గర్ల్స్ క్యాంపస్‌కు వచ్చేవాడు. పరిచయంతో లొంగదీసుకున్న అధికారి పెళ్లి చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించాడు. కొన్నిసార్లు హాస్టల్‌లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపారు.

బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన సితాన్షు తనకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆపై పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఆ విద్యార్థిని వాపోయింది. నిందితుడితో పాటు అతడి సోదరి, బామ్మర్ది, ఓ స్నేహితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement