కీచకుడిపై అపరకాళికలా మారిపోయి! | girl student beating a man who sexually harassed her and video goes viral | Sakshi
Sakshi News home page

కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!

Published Tue, Jan 24 2017 9:29 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

కీచకుడిపై అపరకాళికలా మారిపోయి! - Sakshi

కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!

భువనేశ్వర్: తనను వేధిస్తున్న కీచకుడికి చేతలతో సమాధానం చెప్పింది.. అందరితో శెభాష్ అనిపించుకుంది ఒడిషా జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. అంతటితో ఆగకుండా తనపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిని చితకబాదడంతో పాటు వీడియో తీసింది. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి తనపై వేధింపులు మొదలుపెట్టి, కొద్ది సమయం తర్వాత తనపై లైంగిక దాడికి యత్నించాడని విద్యార్థిని చెప్పింది. ప్రతిరోజు తన ఫ్రెండ్స్‌ను ఇలాగే వేధిస్తుంటారని అందుకే అతడికి బుద్ధి చెప్పాలని భావించి, అపరకాళికలా తిరగబడింది.

ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఓ సెంటర్‌కు వచ్చాక ఎవరిదారిన వారు వెళ్తున్నారు. ఇంతలో స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, హెచ్చరించినా పట్టించుకోలేదట. ఇక తనను తాను రక్షించుకోవాలని భావించి గట్టిగా అరుస్తూ అతడిని కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే అక్కడికి చాలా మందితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక చూడండీ.. అందరూ కలిసి అతడి చెంపలు వాయిస్తుండటంతో 'నన్ను క్షమించండీ.. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను' అని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ అమ్మాయిలను వేడుకున్నాడు. వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా షేర్ అవుతోంది. విద్యార్థిని చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement