ఏలూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత విద్యార్థినులకు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులపై నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం తెలిసిందే. మాట్రిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు . ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.