
హైదరాబాద్: కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ యువతి తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు దుర్భాషలాడుతూ హల్‌చల్ చేసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ వాహనదారుడు దీనిని వీడియో తీసి సామా జిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై ట్వీటర్‌లో హరీష్‌ఓజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామలింగరాజు బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ సిక్ విలేజ్‌కు చెందిన లుబ్న అనే యువతి వోక్స్ వ్యాగన్ వైట్ కారులో సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్తుంది. స్థానికంగా ఉన్న నల్లి సిల్క్స్ వద్దకు రాగానే కారును అతివేగంతో నడుపుతూ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. పలువురి వాహనాలను ఢీకొట్టింది.
అంతటితో ఆగకుండా కారులో నుంచి వాహనదారులతో వాగ్వివాదానికి దిగింది. ఓ ద్విచక్రవాహనదారుడిని యువతి బెదిరించడంతో పాటు దుర్భాషలాడింది. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామలింగరాజు ఆమెను నియంత్రించేందుకు యత్నించినా వినిపించుకోకుండా ఇష్టారాజ్యంగా దూషిస్తూ కారులో వెళ్లిపోయింది. ఈ క్రమంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జాం నెలకొంది. ఆమెపై ర్యాష్ డ్రైవింగ్ చేసి వాహనదారులపై దూసుకెళ్లినందుకు గాను ఐపీసీ 279, దుర్భాషలాడి రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు గాను 70(బీ) సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment