ఉప్పల్‌లో మెట్రో రైలు స్టేషన్‌ను పరిశీలిస్తున్న సోమేష్‌కుమార్
గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు పనుల వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్.. హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ, ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారులకు జూన్‌లోగా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మెట్రో పనులు జరుగుతున్న బేగంపేట్, ఉప్పల్ ప్రాంతాలను మంగళవారం హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
బేగంపేట్ ఓవర్ బ్రిడ్జి నాలా ప్రాంతంలో నూతన పిల్లర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఇక్కడ ప్రత్యామ్నాయ రహదారిలో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్, డిపో పనులను పరిశీలించారు. మెట్రో పిల్లర్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయన వెంట జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు.