Over Bridge
-
ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
కృష్ణాజిల్లా , పొన్నూరు: ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పొన్నూరు పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన అద్దంకి వీర ప్రసాదరావు కుమార్తె అమదాలపల్లి సునీత(35) నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జిపై నుంచి తుంగభద్ర డ్రెయిన్‌లో దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డ్రెయిన్‌లోకి దిగి ఆమెను బయటకు తీసి నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలి సిన పట్టణ సీఐ ఎం.నాగేశ్వరావు, ఎస్ఐ డి.కిషోర్‌బాబులు ఆస్పత్రికి బాధితురాలిని సందర్శించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. మృతిరాలు తండ్రి అద్దంకి వీరప్రసాదరావు మాట్లాడుతూ తన కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2 నెలల క్రి తం అల్లుడు వద్ద నుంచి ´న్నూ రు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రో గం తగ్గకపోవటంతో మనస్తాపానికి గురై ఓవర్ బ్రిడ్జి పై నుంచి దూకి మృతి చెందిం దని ఆయన పోలీసులకు తెలిపారు. వీరప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
ముగ్గురి మృతి
సీతానగరం: సీతానగరం ఓవర్ బ్రిడ్జి వద్ద ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరం కాంతమ్మ(50) మసాల సామాన్లు విక్రయిస్తుంటుంది. ఆదివారం జోగింపేటలో సరుకును విక్రయించి పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కి సీతానగరం వద్ద బ్రిడ్జి వద్ద ఆపాలని కాంతమ్మ చెప్పింది. రాష్ట్రీయ రహదారిపై ఉన్న ఆర్వోబీ దగ్గర ఆటో దిగి కాలనీలో ఉన్న కుమారుడు జాన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో కాంతమ్మ తలపై నుంచి రెండు టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురికి బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాల పాలైన వారిలో అప్పయ్యపేటలో ఆటో ఎక్కిన ఎం.లక్ష్మి, కె.సునీత, బి.భాగ్యలక్ష్మి, బి.సావిత్రమ్మ ఉన్నారు. వీరితో పాటు మింది జగన్నాధం, ఈర్ల వినయ్‌కుమార్, ఆటో డ్రైవరు నాగభూషణరావులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ డి.సాయిక్రిష్ణ గాయపడ్డ వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతురాలు కాంతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు ఢీకొని... రామభద్రపురం: మండలంలోని కొండపాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కోటశిర్లాం గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి లక్ష్మణ(35) విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు...లక్ష్మణ మోటారుసైకిల్‌తో రామభద్రపురం నుంచి బాడంగి ఆసుపత్రికి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి ఎదురుగా వస్తున్న కారు కొండపాలవలస వద్ద ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రమైన గాయమైంది. చికిత్స నిమిత్తం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ డిడి.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ తాపీ పని చేస్తూ జీవిస్తూ ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఎలా బతికేదంటూ బోరుమన్నారు. లక్ష్మణకు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయం చేసేందుకు వెళ్లి...తిరిగొచ్చే క్రమంలో... లక్ష్మణ రామభద్రపురం మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రౌతు బోగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి ఆటోలో తరలించాడు. ఈ క్రమంలో లక్ష్మణ ద్విచక్ర వాహనం రామభద్రపురంలో ఉండిపోయింది. దీన్ని తీసుకువెళ్లేందుకు రామభద్రపురం వచ్చి తిరిగి బోగేశ్వరరావు మృతదేహం వద్దకు వెళ్తుండగా ఇలా మృత్యువాత పడ్డాడు. దీంతో కోటశిర్లాంలో విషాదం అలముకొంది. రోడ్డు ప్రమాదంలో... నెల్లిమర్ల రూరల్: మండలంలో చిన రాడపేట జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు...విజయనగరంలో పూల్‌బాగ్ కాలనీకి చెందిన దాసు సూర్యనారాయణ(44) చినబూరాడపేట గ్రామంలో నివాసముంటున్న తన కుమార్తెను చూసేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బూరాడపేట జంక్షన్ వద్ద ఆటో వెనుక భాగంలో ఎక్కుతుండగా అదుపుతప్పి వెనక్కి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను స్థానికులు విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. కేజీహెచ్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శరణాలయాలకు శ్రీకారం ఎప్పుడో
కాలిబాటలు.. గుడి మెట్లు.. ఓవర్ బ్రిడ్జిల దిగువన.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో.. బతుకు పడమటి పొద్దున చావు కోసం నిరీక్షించే వృద్ధులెందరో కనిపిస్తుం టారు. వీరంతా వయసులో ఉన్నప్పుడు తమ జవసత్వాలను వినియోగించి ఏదో రూపంలో సమాజ గమనానికి తమ వంతు సహకారం అందించిన వారే. తమ పొట్ట తాము పోసుకున్నవారే. జీవన సంధ్యలో రోజు గడవటం వారికి గగనమైంది. అవసరాలను తీర్చే ఆత్మీయతకు దూరమయ్యారు. అయిన వారికి భారమయ్యారు. తమ రెక్కల కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి.. పెంచి పోషించిన బిడ్డలే నిరాదరించగా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి యాచిస్తూ తమంతట తాము చావలేక మృత్యువు కరుణించే క్షణాల కోసం నిరీక్షించే వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కని, పెంచిన తల్లిదండ్రులకు చరమాంకంలో ఇంత బువ్వ పెట్టి పసిపిల్లల్లా సాకాల్సిన కొడుకులు, కూతుళ్లు కర్కశ హృదయులుగా మారడానికి పేదరికమే ప్రధాన కారణమన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే పేదలందరూ కన్న ారిని ఇలా రోడ్ల పాలు చేయకపోవచ్చు. అలా అని స్థోమత ఉండీ వృద్ధులను వృథా జీవులుగా పరిగణించేవారూ లేకపోలేదు. సంపన్నులైన వృద్ధు లు సొమ్ము చెల్లించి వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు. మరి పేదరికంలో మగ్గుతున్న వృద్ధుల మాటేమిటి? వీరు నేడు నిస్సహాయులుగా మారిపోవచ్చు. వారంతా ఒకప్పుడు సమాజ గమనానికి తమ శక్తిని ధారపోసి నేటి జీవితానికి పునాదులు నిర్మించిన వారనే నిజాన్ని గుర్తించి వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత వారి బిడ్డలపైనే కాదు సమాజంపైనా ఉంది. ఈ బాధ్యత పాలకులపై మరీ ఎక్కువ. చంద్రబాబు సర్కారు ఇటువంటి సమాజ బాధ్యతనే నెత్తిన వేసుకున్నామని ఘనంగా ప్రకటించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున వృద్ధుల శరణాలయాలు నిర్మించాలని తలపోసింది. చంద్రబాబు మూడునెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఆ తరువాత విధివిధానాల ప్రకటన రాలేదు. కానీ గనులు, మహిళా, శిశు సంక్షేమ, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి పీతల సుజాత ఇటీవలే ఈ శరణాలయాల విషయం ప్రస్తావించారు. కానీ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా అనేది స్పష్టం చేయలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిపించిన సెంటిమెంట్‌తో మన జిల్లాలోనే ఈ ప్రకటన చేసినట్టుగానే ఈ వృద్ధుల శరణాలయాల ఏర్పాటు కూడా ఈ జిల్లా నుంచే మొదలైతే బాగుంటుందని అధికార పార్టీ వర్గాలూ అంటున్నాయి. మంత్రిగా పీతల సుజాత అరుునా పట్టించుకుని వృద్ధాశ్రమాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా కార్యాచరణలోకి తీసుకు రావాలన్నదే అందరి ఆకాంక్ష. సీసీల సిల్లీ పనులు ఎక్కడో మీవంటి కోటికొక్కరు తప్పించి పొగడ్తలకు పడిపోనివారెవరు.. అంటూ ఓ మందిమాగధ స్త్రోత్రం ప్రతి నిత్యం మహారాజా వారిని పడగొట్టేదట. సరిగ్గా ఇలానే జిల్లాలోని పలువురు ముఖ్యనేతలు, అధికారుల వద్ద సీసీలు, పీఏలుగా పని చేస్తున్న వారు ఆయా ప్రముఖులను పొగడ్తలతో ముంచెత్తుతూ.. ప్రజలతో మీరెందుకు మాట్లాడటం.. మేం చూసుకుంటాం కదా.. అని వారికి అందరినీ దూరం చేస్తున్నారట. జిల్లాలోని ఓ కీలక అధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న ఒకాయన ప్రజలతో సదరు అధికారికి నేరుగా సంబంధాలు లేకుండా అడ్డుగోడగా నిలుస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉండే అధికారి ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వారు సీసీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వస్తుండటం రివాజు. ఎప్పుడో ఒకసారి ఆ అధికారి అయినా నేరుగా ఫోన్లో అందుబాటులోకి వస్తారేమో కానీ.. సదరు సీసీ మాత్రం కనీసం ఫోన్ కూడా తీయలేనంతగా ఎప్పుడూ బీజీనేననట. అదేమంటే అధికారి వెంటే ఉంటాను కాబట్టి ఫోన్లు తీయడం లేదని చెబుతుంటారు. అధికారి కోసం ఈయనకు చేస్తే ఫోన్ తీయరు. మరి ఈయన కోసం ఎవరికి చేయాలి. బహుశా.. సీసీకి ఇంకో సీసీ కావాలేమో. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
ట్రా‘ఫికర్’ లేకుండా చూడండి
గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ సాక్షి,సిటీబ్యూరో: నగరంలో జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు పనుల వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్.. హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ, ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారులకు జూన్‌లోగా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మెట్రో పనులు జరుగుతున్న బేగంపేట్, ఉప్పల్ ప్రాంతాలను మంగళవారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. బేగంపేట్ ఓవర్ బ్రిడ్జి నాలా ప్రాంతంలో నూతన పిల్లర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఇక్కడ ప్రత్యామ్నాయ రహదారిలో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్, డిపో పనులను పరిశీలించారు. మెట్రో పిల్లర్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు.