'బేగంపేట' కేసులో కోర్టు తుది తీర్పు | Task force office blast case: Final verdict today | Sakshi
Sakshi News home page

'బేగంపేట' కేసులో కోర్టు తుది తీర్పు

Published Thu, Aug 10 2017 1:02 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

'బేగంపేట' కేసులో కోర్టు తుది తీర్పు - Sakshi

'బేగంపేట' కేసులో కోర్టు తుది తీర్పు

బేగంపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసులో 9 మంది నిందితులను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది.

టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై దాడి కేసులో 9 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

హైదరాబాద్: బేగంపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసులో 9 మంది నిందితులను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది. ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేకపోయవడంతో 9 మంది నిందితులపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా 10 మందిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కోర్టు తీర్పును డిఫెన్స్‌ లాయర్‌ స్వాగతించారు. ప్రాసిక్యూషన్‌ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చిందని చెప్పారు. నిందితుల్లో కొంత మంది కొందరు 11 ఏళ్లుగా జైలులో ఉన్నారని, మరికొందరు ఏడేళ్లుగా కారాగారవాసం గడుపుతున్నారని తెలిపారు. తీర్పు పూర్తి పాఠం చదివిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. కాగా, కోర్టు తీర్పుపై ప్రాసిక్యూషన్‌ హైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

2006, అక్టోబరు 16న టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి జరిగింది. ఘనటలో హోంగార్డు సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, కానిస్టేబుల్‌ వెంకటరావుకు తీవ్రగాయాలయ్యాయి. బంగ్లాదేశ్‌కు చెందిన డాలిని ఉగ్రవాద సంస్థ హుజీ ఇక్కడికి తీసుకొచ్చి మానవబాంబుగా మార్చి ఈ దాడికి పాల్పడిందని దర్యాప్తు బృందం తేల్చింది. రెండేళ్లు పరిశోధించాక 10 మందిని అరెస్టుచేసి జైలుకు తరలించారు. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పించి, విచారణ మొదలుపెట్టారు. వివిధ దశల అనంతరం గురువారం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement