ఆ 10 మంది నిర్దోషులు.. | Hyderabad: Court acquits 10 accused in Task Force Office blast case | Sakshi
Sakshi News home page

ఆ 10 మంది నిర్దోషులు..

Published Fri, Aug 11 2017 12:56 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై 2005లో జరిగిన మానవ బాంబు దాడి కేసులో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితు లుగా ఉన్న 10 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై 2005లో జరిగిన మానవ బాంబు దాడి కేసులో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితు లుగా ఉన్న 10 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులు నేరం చేసినట్లు పోలీసులు నిరూపించలేక పోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు 7వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రే ట్‌ టి.శ్రీనివాసరావు తన తీర్పులో పేర్కొ న్నారు. ఘటనా స్థలంలోని పేలుడు పదార్థానికి, కోర్టు ముం దుంచిన శకలాలకు పొంతన కుదరలేదని  తీర్పులో వివరించారు. ఈ దాడి వెనుక నిందితుల పాత్ర ఉన్నదనేందుకు పోలీసులు తగిన సాక్ష్యా ధారాలను చూపలేదన్నారు. నిర్దోషులుగా ప్రకటించిన వారిలో అబ్దుల్‌ కలీం, మహ్మద్‌ అబ్దుల్‌ జాహెద్, నఫీకుల్‌ బిశ్వాస్, షేక్‌ అబ్దుల్‌ ఖాజా, మహ్మద్‌ హిలాలుద్దీన్, షకీల్, సయ్యద్‌ హాజీ, అజ్మల్‌ అలీఖాన్, సయ్యద్‌ అజ్మత్‌ అలీ, మహ్మద్‌ బరూద్‌ వాలా ఉన్నారు.

ఇదీ నేపథ్యం: 2005 అక్టోబర్‌ 12న బంగ్లాదేశ్‌కు చెందిన డాలి శరీరానికి బాంబు అమర్చుకుని టాస్క్‌ఫోర్స్‌ కార్యా లయం వద్ద తనను తాను పేల్చు కున్నాడు. ఈ ఘటనలో హోంగార్డు సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, మరో కానిస్టేబుల్‌  గాయపడ్డారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం ఈ కేసును  సిట్‌కు బదిలీ చేశారు. దర్యా ప్తును పూర్తి చేసిన సిట్‌ 2010లో చార్జిషీట్‌ దాఖలు చేసింది. మొత్తం 20 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో డాలి పేలుడులో మృతి చెందగా, ఇద్దరు నింది తులు గులాం యజ్దానీ, షాహెద్‌ బిలాల్‌లు ఎన్‌కౌం టర్లలో మృతిచెందారు. మిగిలిన వారిలో 10 మంది జైల్లో ఉండగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు. జైల్లో ఉన్న 10 మందిలో 9 మందిని  పోలీసులు కోర్టులో హాజరు పరచగా, అనారోగ్య కారణాలతో బరూద్‌ వాలా బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ 10 మందిని కూడా న్యాయమూర్తి గురువారం నిర్దోషులుగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement