
‘బేగంపేట’లోభయపెడుతుందట!
‘కాంచన’లో దెయ్యానికి భయపడిన లక్ష్మీరాయ్, ‘బేగంపేట’ చిత్రంలో 50 దెయ్యాలతో తలపడుతుంది. ఆమె ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘బేగంపేట’. ఇందులో శ్రీరామ్ కథానాయకుడు. సుమన్ ప్రతినాయకుడు. వడివుడయాన్ దర్శకత్వంలో సాలోమ్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవలే భారీ షెడ్యూలు జరుపుకున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసరెడ్డి, సంగీతం: జాన్ పీటర్.