
నగరంలో ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు వాహనదారులు. భారీగా ఎక్కడికక్కడ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాలా చోట్ల మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ దగ్గర, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ ఆస్పత్రుల చుట్టూరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి నుంచి పరిస్థితి అలాగే ఉండడంతో వాహనదారులు చిరాకు పడుతున్నారు.
సోమవారం సాయంత్రం సైతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. ఇక ఇవాళ(మంగళవారం) ఉదయం సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పంజాగుట్ట-ఎల్వీప్రసాద్ రూట్‌లో, పంజాగుట్ట, బేగంపేట దగ్గర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.