బేగంపేటలో కేసీఆర్ కు కొత్త క్యాంప్ ఆఫీస్!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను సందర్శకులు కలిసేందుకు వీలుగా బేగంపేటలో కొత్తగా తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఎస్ఐబీ బిల్డింగ్ లోకి క్యాంపు కార్యాలయాన్ని మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత ఎస్ఐబీ కార్యాలయం మార్పు చేర్పులకు 46 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్పులు చేర్పులు పూర్తి చేసుకుని త్వరలోనే కొత్త క్యాంపు కార్యాలయంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.