
ఇటు టీనేజర్లు.. అటు సీనియర్ సిటిజన్లు మోడళ్లను తలపించేలా ర్యాంప్ వాక్‌తో కేక పుట్టించారు. హుషారుగా వయ్యారాల నడకతో కనువిందు చేశారు.

బేగంపేట కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడి క్లబ్ ఆవరణలో జరిగిన ఆసియాస్ బిగ్గెస్ట్ డార్లింగ్స్ డే 2025 వేడుకల్లో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించింది

భార్యాభర్తలు..అన్నాచెల్లెళ్లు.. తాత మనుమలు.. అమ్మమ్మ మనువడు.. ఇలా వినూత్న రీతిలో పలు సీక్వెన్స్‌లో వారు వాక్ చేస్తూ అలరించారు.

మ్యూజిక్‌కు అనుగుణంగా వాక్ చేస్తూ అదరహో అనిపించారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ గ్రూప్ చైర్మన్ వై.రాజీవ్‌రెడ్డి డార్లింగ్స్ డే వేడుక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబంలో అందరి ప్రేమ, ఆప్యాయత, అనురాగమే ఈ డార్లింగ్స్ డే అని వివరించారు.










