బేగంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు
Published Wed, Aug 24 2016 2:23 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
హైదరాబాద్: మహారాష్ట్రతో నీటిపారుదల ప్రాజెక్టుల ఒప్పందం కుదుర్చుకుని బుధవారం నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు తెరాస శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం వరకు ఊరేగింపు జరగనున్నట్టు సమచారం. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో వచ్చే కార్యకర్తలకు ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జితేందర్ తెలిపారు.
Advertisement
Advertisement