
దాండియా సందడి
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: నవరాత్రి సంబరాలకు నగర మహిళలు సందడిగా స్వాగతం పలికారు. బేగంపేటలోని మనోహర్ హోటల్‌లో నిర్వహించిన దాండియా నృత్యంలో అడుగులు కలిపి ఉర్రూతలూగించారు. నగరానికి చెందిన ఫన్‌కార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దాండియా నృత్యహేల అలరించింది. ఈవెంట్‌లో ఇండోవెస్ట్రన్ దుస్తుల్లో మెరిసిన ఆధునిక మహిళ... సంప్రదాయ నృత్యాలకు తనదైన సోయగాలను మేళవించింది. కార్యక్రమాన్ని ఫన్‌కార్ నిర్వాహకురాలు సుశీలా బొకాడియా పర్యవేక్షించారు.