బేగంపేట టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసులో 9 మంది నిందితులను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది. ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపలేకపోయవడంతో 9 మంది నిందితులపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా 10 మందిని అరెస్ట్ చేశారు. ముగ్గురు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కోర్టు తీర్పును డిఫెన్స్ లాయర్ స్వాగతించారు. ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చిందని చెప్పారు. నిందితుల్లో కొంత మంది కొందరు 11 ఏళ్లుగా జైలులో ఉన్నారని, మరికొందరు ఏడేళ్లుగా కారాగారవాసం గడుపుతున్నారని తెలిపారు. తీర్పు పూర్తి పాఠం చదివిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. కాగా, కోర్టు తీర్పుపై ప్రాసిక్యూషన్ హైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.