
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపైనే లారీ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడటంతో బీరు సీసాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Comments
Please login to add a commentAdd a comment