బేగంపేటలో వ్యాన్ ప్రమాదం : ఆరుగురికి గాయాలు
Published Sat, Sep 3 2016 10:08 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM
హైదరాబాద్ : నగరంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బేగంపేటలో జనాల పైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement