సాక్షి, హైదరాబాద్: బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ విద్యార్థినులు ఆందోళనను ఉధృతం చేశారు. డ్రెస్ విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ చేసిన వ్యాఖ్యలతో ధర్నాకు దిగారు. మోకాళ్ల పైకి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్‌లోకి అనుమతించనని ప్రిన్సిపల్ పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి డ్రెస్‌లు వేయడం వల్ల పెళ్లిల్లు కావని ప్రిన్సిపల్ అంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. డ్రెస్ కోడ్ పాటించని కొందరు విద్యార్థులను మహిళా సెక్యురిటీ కాలేజ్‌లోనికి రానివ్వలేదని, కాలేజ్ వారు పెట్టిన రూల్స్ మార్చకపోతే నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాకల్టీతో సమస్యలేదు కానీ మేనేజ్‌మెంట్‌కు సమస్య ఉంది అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా కూడా మేనేజేమెంట్ ఏ మాత్రం స్పందించలేదని కాలేజ్ గేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం విద్యార్థినులతో మాట్లాడింది. సమస్య పరిష్కారం అయిందని యాజమాన్యం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment