St francis college
-
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థుల సందడి (ఫోటోలు)
-
డ్రెస్ కోడ్ విషయంలో విద్యార్థినుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ విద్యార్థినులు ఆందోళనను ఉధృతం చేశారు. డ్రెస్ విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ చేసిన వ్యాఖ్యలతో ధర్నాకు దిగారు. మోకాళ్ల పైకి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్‌లోకి అనుమతించనని ప్రిన్సిపల్ పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి డ్రెస్‌లు వేయడం వల్ల పెళ్లిల్లు కావని ప్రిన్సిపల్ అంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. డ్రెస్ కోడ్ పాటించని కొందరు విద్యార్థులను మహిళా సెక్యురిటీ కాలేజ్‌లోనికి రానివ్వలేదని, కాలేజ్ వారు పెట్టిన రూల్స్ మార్చకపోతే నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాకల్టీతో సమస్యలేదు కానీ మేనేజ్మెంట్కు సమస్య ఉంది అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా కూడా మేనేజేమెంట్ ఏ మాత్రం స్పందించలేదని కాలేజ్ గేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం విద్యార్థినులతో మాట్లాడింది. సమస్య పరిష్కారం అయిందని యాజమాన్యం ప్రకటించింది. -
సెయింట్ ఫ్రాన్సిస్ ముందంజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి, సెయింట్ ఆన్స్ కాలేజి జట్లు లీగ్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ పోటీల్లో గ్రూప్(ఏ) విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో వాసవి ఇంజనీరింగ్ కాలేజిపై విజయం సాధించింది. గ్రూప్(బి) విభాగంలో సెయింట్ ఆన్స్ కాలేజి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజిపై గెలిచింది. లీగ్ ఫలితాలు గ్రూప్(ఏ) విభాగం: సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో ఏఎంఏ కాలేజిపై, ఓయూ ఇంజనీరింగ్ కాలేజి 2-1తో అరోరా కాలేజిపై, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో ఓయూ ఇంజనీరింగ్ కాలేజిపై గె లుపొందాయి. గ్రూప్(బి) విభాగం: సెయింట్ ఆన్స్ కాలేజి 2-1తో హుస్సేన్ ఆలమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజిపై, భద్రుకా కాలేజి 2-1తో లయోలా అకాడమీపై గెలిచాయి.