ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్ గా తెలుసుకుంటున్నాను" అంటున్నాడు యంగ్ హీరో మణి సాయి తేజ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన మణి సాయి తేజ "బ్యాట్ లవర్స్" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావడంతో వెంటనే ‘రుద్రాక్షాపురం’ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు.
కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన "మెకానిక్" త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన "నచ్చేశావే పిల్ల నచ్చేశావే" పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణి సాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. "మెకానిక్" తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని మణి సాయి తేజ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment