Mani Sai Teja
-
‘మెకానిక్’తో నాకు మరింత గుర్తింపు తెస్తుంది: హీరో మణి సాయితేజ
ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్ గా తెలుసుకుంటున్నాను" అంటున్నాడు యంగ్ హీరో మణి సాయి తేజ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన మణి సాయి తేజ "బ్యాట్ లవర్స్" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావడంతో వెంటనే ‘రుద్రాక్షాపురం’ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన "మెకానిక్" త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన "నచ్చేశావే పిల్ల నచ్చేశావే" పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణి సాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. "మెకానిక్" తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని మణి సాయి తేజ అన్నారు. -
అల్లు అర్జునే రోల్ మోడల్.. అదే నా లక్ష్యం: మణి సాయి తేజ
ఐకాన్ స్టార్ అల్లు అర్జునే తనకు రోల్ మోడల్ అని, ఆయనంత కాకపోయినా.. మంచి నటుడిగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని యువ నటుడు మణి సాయితేజ అన్నారు. ఆయన హీరోగా ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మణితేజ్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌కి వీరాభిమానిని నేను. ‘అల వైకుంఠపురంలో’ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వెళ్తే.. సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కానీ ఆ సినిమాలో నటించిన నటీనటులు దర్జాగా లోపలికి వెళ్లారు. అప్పుడే హీరో అవ్వాలని ఫిక్సయిపోయాను. రెండేళ్లు కర్ణాటకలో నటనపై శిక్షణ తీసుకున్నా. తొలి చిత్రం ‘బ్యాట్ లవర్స్’ షూటింగ్ జరుపుకుంటుండగానే... ‘రుద్రాక్షపురం’లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కృష్ణవంశీ శిష్యుడు మునిశేఖర్ దర్శకత్వంలో ‘మెకానిక్’ అనే చిత్రంలో నటిస్తున్నాను’అని సాయి తేజ్ అన్నారు -
మంచి సందేశం ఇచ్చేందుకు రెడీ అవుతున్న ‘మెకానిక్’
మణిసాయితేజ , రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
అదే నా లక్ష్యం: మణి సాయితేజ
‘‘సినిమా ఇండస్ట్రీ వారి కథలు, వ్యధలు ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘రుద్రాక్ష పురం’. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని నటుడు మణి సాయితేజ అన్నారు. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రాక్షపురం’. కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించిన మణి సాయితేజ మాట్లాడుతూ– ‘‘నటనపై ఇష్టంతో రెండేళ్లు కర్ణాటకలో శిక్షణ తీసుకున్నాను. నా తొలి చిత్రం ‘బ్యాట్ లవర్స్’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. రెండో సినిమా ‘రుద్రాక్షపురం’లోనూ మంచి పాత్ర చేశాను. ముని సాహేకర్ దర్శకత్వంలో నా మూడో సినిమా ‘మెకానిక్’ తెరకెక్కనుంది. మున్నా నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది’’ అన్నారు.