‘‘సినిమా ఇండస్ట్రీ వారి కథలు, వ్యధలు ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘రుద్రాక్ష పురం’. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని నటుడు మణి సాయితేజ అన్నారు. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రాక్షపురం’. కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన మణి సాయితేజ మాట్లాడుతూ– ‘‘నటనపై ఇష్టంతో రెండేళ్లు కర్ణాటకలో శిక్షణ తీసుకున్నాను. నా తొలి చిత్రం ‘బ్యాట్ లవర్స్’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. రెండో సినిమా ‘రుద్రాక్షపురం’లోనూ మంచి పాత్ర చేశాను. ముని సాహేకర్ దర్శకత్వంలో నా మూడో సినిమా ‘మెకానిక్’ తెరకెక్కనుంది. మున్నా నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment