
ఐకాన్ స్టార్ అల్లు అర్జునే తనకు రోల్ మోడల్ అని, ఆయనంత కాకపోయినా.. మంచి నటుడిగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని యువ నటుడు మణి సాయితేజ అన్నారు. ఆయన హీరోగా ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా మణితేజ్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌కి వీరాభిమానిని నేను. ‘అల వైకుంఠపురంలో’ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వెళ్తే.. సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కానీ ఆ సినిమాలో నటించిన నటీనటులు దర్జాగా లోపలికి వెళ్లారు. అప్పుడే హీరో అవ్వాలని ఫిక్సయిపోయాను. రెండేళ్లు కర్ణాటకలో నటనపై శిక్షణ తీసుకున్నా. తొలి చిత్రం ‘బ్యాట్ లవర్స్’ షూటింగ్ జరుపుకుంటుండగానే... ‘రుద్రాక్షపురం’లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కృష్ణవంశీ శిష్యుడు మునిశేఖర్ దర్శకత్వంలో ‘మెకానిక్’ అనే చిత్రంలో నటిస్తున్నాను’అని సాయి తేజ్ అన్నారు
Comments
Please login to add a commentAdd a comment