మణిసాయితేజ , రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment