
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్‌ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్‌ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందున్నప్పటికీ మెకానిక్‌లు మాత్రం వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సదస్సుకు సుమారు రెండు వేల మంది మెకానిక్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక నాయకులు తోడేటి బాబు, స్వామి, రమేష్, ఆశోక్‌రెడ్డి, సుజేందర్, రాము, రవికాంత్, లక్ష్మణ్, రాజు, రాజినీకాంత్, మనోహర్, జాఫర్, రమేష్, పాషా, శంకర్, సురేష్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment