విశాఖలో బస్సు దగ్ధం | Bus Burnt In Visakhapatnam District | Sakshi
Sakshi News home page

విశాఖలో బస్సు దగ్ధం

Published Sun, Jan 5 2020 7:54 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

గాజువాక పోర్టు రోడ్డు పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న లారీ మెకానిక్‌​ గ్యారేజ్‌లో  పెనుప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మత్తుల కోసం వచ్చి గ్యారేజ్‌లో ఉన్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో గ్యారేజ్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement