అప్పు తిరిగి చెల్లించలేదని.. | Loan murder in ammerpet | Sakshi
Sakshi News home page

అప్పు తిరిగి చెల్లించలేదని..

Published Sat, Mar 3 2018 8:36 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

Loan murder in ammerpet - Sakshi

వెంకటరాజ్యం మృతదేహం

అమీర్‌పేట: వ్యాపారం లో నష్టానికి కారణమయ్యాడనే కోపంతో ఓ మెకానిక్‌ కారు  యజమానిని దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  శుక్రవారం జరిగింది. ఇన్స్‌పెక్టర్‌ వహీదుద్దీన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌  మండలం, మడికొండకు చెందిన వెంకటరాజ్యం (32) నగరానికి వలస వచ్చి ఇంద్రానగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కారు అద్దెకు నడుపుకుంటున్నాడు. అతడికి మధురానగర్‌ జీ  బ్లాక్‌కు చెందిన మెకానిక్‌ కృష్ణతో పరిచయం ఏర్పడింది. కృష్ణ సలహా మేరకు జైలో కారు కొనుగోలు చేసిన వెంకటరాజ్యం రూ.లక్ష అప్పు కావాలని కోరడంతో కృష్ణ తనకు తెలిసిన వ్యక్తి వద్ద  అప్పు ఇప్పించాడు.

అయితే సకాలంలో అప్పు తీర్చలేకపోగా గత మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు రోజుల క్రితం కృష్ణకు   ఫోన్‌ చేసిన వెంకటరాజ్యం జైలో కారును విక్రయించి షిఫ్ట్‌ డిజైర్‌ కారు కొనాలని, బాకీ తీరుస్తానని చెప్పాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కృష్ణ  ఓ కారు అమ్మకానికి ఉందని, వెంటనే వస్తే ఇప్పిస్తానని చెప్పడంతో అతను శుక్రవారం మధ్యాహ్నం షెడ్డు వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా అప్పు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరడంతో ఆవేశానికి లోనైన కృష్ణ స్క్రూడైవర్‌తో వెంకటరాజ్యం దాడి చేసి, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న వెంకట్‌ను 108లో గాంధీ ఆసుపత్రికి తరళించగా అప్పటికే మృతి  చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement