
వాచ్ కాస్తా.. బైక్ అయింది!
నేర్పు ఉన్న మెకానిక్‌లోని నిద్రలేచిన కళాకారుడికి నిదర్శనం ఈ వాచ్ బైక్‌లు. వీటికి రూపమిచ్చింది...
సృజనాత్మకం
నేర్పు ఉన్న మెకానిక్‌లోని నిద్రలేచిన కళాకారుడికి నిదర్శనం ఈ వాచ్ బైక్‌లు. వీటికి రూపమిచ్చింది... డన్ తనన్‌బమ్. వాచీలు బాగు చేస్తాడు డన్. వాచీలను సేకరించడం అతని హాబీ కూడా. ఎన్నో విలువైన చేతి గడియారాలను సేకరించా డతను. వాటిలో పనికిరాని వాటికి కొత్త రూపాన్ని కల్పించి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. వీటి తయారీకి వాచీల్లోని విభాగాలను తప్ప.. చిన్న రాగి కడ్డీని కూడా వేరే చోట నుంచి తీసుకోలేదు. వృత్తాకారపు వాచ్‌లోని అద్దం, గడియారానికి సూచిగా ఉండే గోళం, బ్యాటరీలు, అందులోని రాగి వైరింగ్... వీటన్నింటినీ ఉపయోగించుకొని బైక్స్ రూపొందించాడు డన్. ఈ బైకు బొమ్మలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాచీతో బైక్ చేయడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అతడి టాలెంట్‌కు శభాష్ అంటున్నారు!